AP: నంద్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ-రుద్రవరం మండలం పేరూరు గ్రామ సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విలేజ్ సర్వేయర్‌గా పని చేస్తున్న ఓ మహిళ పని ఒత్తిడి, అధికారులు వేధింపులు తాళలేక మనస్తాపం చెంది పురుగుల మందు తాగింది. హుటాహుటిన ఆమెను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది.