AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మార్పు తీసుకొస్తే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కరే పాలనలో తనకంటూ ప్రత్యేక మార్క్ చూపించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. మంగళవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ‘
వైసీపీ విధ్వంసానికి పల్లెలు కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఎక్కడ చూసినా గుంతలే. గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి. బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. అలాంటి దారుణ పరిస్థితుల నుంచి పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ మార్పులు తీసుకొచ్చారు’ అని అన్నారు.