300కు పైగా సినిమాలు చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?

1766చూసినవారు
300కు పైగా సినిమాలు చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
90ల నాటి నటుడు ఆరిశెట్టి నాగేశ్వరరావు, అలియాస్ వినోద్, 300కు పైగా చిత్రాల్లో నటించారు. గుంటూరుకు చెందిన ఆయన ఎక్కువగా విలన్ పాత్రలు పోషించినప్పటికీ, సహాయక నటుడిగానూ మెప్పించారు. 1980లో 'కీర్తి కాంత కనకం'తో సినీ రంగ ప్రవేశం చేసిన వినోద్, 'నరసింహనాయుడు', 'ఇంద్ర' వంటి చిత్రాల్లో విలన్‌గా మంచి గుర్తింపు పొందారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించారు. 2018 జులై 14న అర్ధరాత్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో 59 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా, చనిపోయే ముందు రోజు రాత్రి సంతోషంగా ఉన్న ఆయన అకస్మాత్తుగా మరణించడం అందరినీ కలచివేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్