వీరంగం సృష్టించిన వినుకొండ డిపో బస్సు కండక్టర్ (వీడియో)

5089చూసినవారు
AP: పల్నాడు జిల్లా వినుకొండ డిపో బస్సు కండక్టర్ వీరసంగం వీరంగం సృష్టించారు. డ్యూటీలో ఉంటూ మద్యం సేవించారు. బస్సులో సిగరెట్ కాల్చుతూ ప్రయాణికులను బూతులు తిట్టారు. మహిళా ప్రయాణికులతో అసభ్య పదజాలంతో మాట్లాడారు. కండక్టర్ తీరుపై ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు కండక్టర్‌పై ఆర్టీసీ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్