VIRAL VIDEO: డిస్నీ యువరాణి.. బాలికతో ముళ్లపంది స్నేహం

17100చూసినవారు
శ్రీలంకలోని పొలొన్నరువ ప్రాంతానికి చెందిన ఓ చిన్నారి, బుజ్జి ముళ్లపంది మధ్య ఏర్పడిన అపురూపమైన అనుబంధం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పచ్చని వరి పొలాల మధ్య చిన్నారి పరిగెడుతుంటే, ముళ్లపంది కూడా ఆమె వెంట ముద్దుగా పరుగులు తీస్తూ కనిపించింది. చిన్నారి సింహళ భాషలో ప్రేమగా మాట్లాడుతుంటే, ఆ ప్రాణి కూడా ఎంతో ఆప్యాయంగా స్పందించడం నెటిజన్లను ఆకట్టుకుంది. సాధారణంగా మనుషులను చూసి భయపడే ముళ్లపంది, ఈ చిన్నారి వద్ద మాత్రం పెంపుడు జంతువులా ప్రవర్తించింది. హృదయాన్ని హత్తుకునే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమెను "రియల్ లైఫ్ డిస్నీ ప్రిన్సెస్" అంటూ ప్రశంసిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్