AP: విశాఖపట్నం నౌకాశ్రయానికి ప్రపంచ టాప్–100 పోర్టుల్లో స్థానం దక్కిందని కేంద్ర ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. విశాఖలోని సాగరమాల కన్వెన్షన్‌లో జనవరి 10న విశాఖ పోర్ట్ అథారిటీకి చెందిన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. దుగరాజపట్నం వద్ద పోర్ట్ కమ్ షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదన ఉందన్నారు. విశాఖలో రూ.305 కోట్లతో అత్యాధునిక షిప్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.