AP: పదేళ్లలోనే విశాఖపట్నం నగరాన్ని ఐటీ హబ్‌గా మారుస్తామని మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కంటే మెరుగైన అభివృద్ధి సాధిస్తామని తెలిపారు. విశాఖలో పూర్తి ఎకో సిస్టమ్‌ను సిద్ధం చేస్తున్నామని, డేటా సెంటర్లను తీసుకురావడమే కాకుండా వాటి నిర్వహణ కూడా కీలకమని అన్నారు. పరిశ్రమలను తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని, రాష్ట్రానికి వచ్చిన ప్రతి పరిశ్రమకు ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా ఉంటుందని హామీ ఇచ్చారు.