AP: విశాఖ ఈస్ట్‌కోస్ట్‌కు మణిహారమని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ దిశగా దేశం ముందుకు సాగుతోందని, ఏపీ అభివృద్ధికి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. పెట్టుబడుల కంటే ఫలితాలపై దృష్టి సారించామని, ఏపీ త్వరలో లాజిస్టిక్స్, ఏవియేషన్ హబ్‌గా ఎదగడంతో దేశ అభివృద్ధికి గేట్వేగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.