AP: విశాఖపట్నం ఇకపై ఏఐ నగరంగా మారనుందని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర
మోదీ, సీఎం చంద్రబాబు విజనరీ నాయకత్వం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి భారీ పెట్టుబడులు సాధ్యమవుతున్నాయి” అని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌తో విశాఖ ‘ఏఐపట్నం’గా గుర్తింపు పొందుతుందని, రాష్ట్రానికి భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.