AP: గత నెల 8న విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఏడుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెండ్ అయిన వారిలో ముగ్గురు డీజీఎంలు, ఇద్దరు సీనియర్ మేనేజర్లు, ఇద్దరు డిప్యూటీ మేనేజర్‌లు ఉన్నారు.