ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బఫర్ స్టాక్ సేకరణ కార్యక్రమం కింద ఉల్లి కనీస కొనుగోలు ధరను కిలోకు ₹15.80 నుంచి ₹16.50కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన ధరలు జూన్ 13 నుంచి అమల్లోకి రానున్నాయి. రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెట్‌లో ధరల స్థిరీకరణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ ఏడాది 2 లక్షల టన్నుల ఉల్లిని బఫర్ స్టాక్ కోసం కొనుగోలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మహారాష్ట్ర రైతులు కిలోకు ₹30 కొనుగోలు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.