AP: విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు తమ సమస్యల పరిష్కారం కోసం నేడు 48 గంటల నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు. అయితే ఈ ఆందోళనకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో నిర్వాసితులు, పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.