విశాఖ స్టీల్ ప్లాంట్ ఇళ్ల స్థలాల వేలం

33చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్ ఇళ్ల స్థలాల వేలం
AP: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు చెందిన సుమారు 93,572 చదరపు గజాల విస్తీర్ణంలోని 459 ప్లాట్లను బహిరంగ ఈ-వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించారు. అయితే ఇవి స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలోనివి కాదు. మద్దిలపాలెంలో 456 నివాస స్థలాలు, గాజువాక పరిధిలోని ప్లాట్లు వేలం జాబితాలో ఉన్నాయి. ఇవి ప్లాంట్ కాంపౌండ్ లోపల కాకుండా, బయట ప్లాంట్ ఉపయోగంలో లేని భూములు. అక్టోబర్ 12 నుంచి 16 తేదీల్లో రెండు విడతలుగా వేలం వేయనున్నారు. బిడ్డర్లు లేదా డెవలపర్లు ప్రతి ప్లాట్‌కు రూ. 2 లక్షల చొప్పున ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్