విశాఖ స్టాక్ మార్కెట్ స్కామ్.. కోటి రూపాయలు కాజేసిన కుటుంబం అరెస్ట్

7169చూసినవారు
విశాఖ స్టాక్ మార్కెట్ స్కామ్.. కోటి రూపాయలు కాజేసిన కుటుంబం అరెస్ట్
AP: విశాఖపట్నంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజల నుంచి సుమారు రూ. 6.5 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఓ కుటుంబాన్ని పీఎం పాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్య నారాయణమూర్తి, ఆయన భార్య త్రిపుర సుందరి, కుమారుడు ఎన్ భగవత్ వెంకట వినోద్, కోడలు గాయత్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ తరఫున స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తామని, లాభాల్లో 50 శాతం వాటా ఇస్తామని నమ్మించి, గడువు ముగిసినా లాభాలు, అసలు కూడా తిరిగి ఇవ్వకుండా నిందితులు తప్పించుకు తిరుగుతున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్