AP: విశాఖను పోర్ట్ సిటీ, స్టీల్ సిటీ అనడం గతమని, ఇప్పుడు ఏఐ, నాలెడ్జ్ సిటీగా అవతరిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ డేటా సెంటర్ గూగుల్‌ను 6 బిలియన్ డాలర్లతో విశాఖలో స్థాపిస్తోందని వెల్లడించారు. హైస్పీడ్ డేటా కమ్యూనికేషన్‌కు వీలుగా ఏఐ సాకేంతికత, సీకేబుల్ కనెక్టివిటీ ఇక్కడ ఉంటుందన్నారు. టీసీఎస్, యాక్సెంచర్ సంస్థలు కూడా వీఎస్‌పీ నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.