
చిరు వ్యాపారుల శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.30 వేలు
AP: చిరు వ్యాపారుల శుభవార్త. వీరి కోసం కేంద్ర ప్రభుత్వం ‘స్వనిధి క్రెడిట్ కార్డు’లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పీఎం స్వనిధి స్కీమ్‌లో భాగంగా రెండో విడత రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన వ్యాపారులకు ఈ క్రెడిట్ కార్డు ఇస్తుంది. ఇది UPI లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు. ఒక్కొక్కరూ రూ.30 వేల వరకు రుణం పొందొచ్చు. వ్యాలిడిటీ 5ఏళ్లు ఉంటుంది. కార్డు కోసం లోన్ ఇచ్చిన బ్యాంకులో సంప్రదించాలి. ఈ పథకాన్ని ఏపీలోని తిరుపతి జిల్లాలో తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. 7,020 మంది దీనికి అర్హత సాధించారు.

































