గత ఏడాది డిసెంబర్ లో జరిగిన శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో రూల్ 377 అంశంపై అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సి. ఎం. రమేష్ పూడిమడక వద్ద ఫిషింగ్ హార్బర్ ను సకాలంలో పూర్తి చేయాలని లోక్ సభలో చర్చించిన అంశంపై స్పందిస్తూ కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ మంత్రి లేఖ వ్రాశారు. పూడిమడక వద్ద మత్స్య ప్రాజెక్టు సకాలంలో అభివృద్ధి చేస్తే ఆర్ధిక అవకాశాలు మెరుగుపడతాయని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఎంపీ తెలిపారు