రిజిస్ట్రేషన్లు బంద్.. ప్రభుత్వానికి రూ.2 కోట్ల గండి ?

1485చూసినవారు
రిజిస్ట్రేషన్లు బంద్.. ప్రభుత్వానికి రూ.2 కోట్ల గండి ?
396 జీవో రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనతో సోమవారం జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోయాయి. అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, నక్కపల్లి, చోడవరం కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రభుత్వానికి సుమారు రూ. 2 కోట్ల ఆదాయానికి గండి పడినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది డాక్యుమెంట్ రైటర్లు సోమవారం ఆందోళన తెలిపారు.

సంబంధిత పోస్ట్