అరకు వ్యాలీ, పాడేరులో ముచింగిపుట్ మండలం బుంగపుట్టు పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ బుధవారం కూటమి నాయకులు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని రకాల పథకాలు అందుతున్నాయని, తాము సంతోషంగా ఉన్నామని ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు సంధ్య మేడం, కార్యదర్శి జగత్రి, పంచాయతీ అధ్యక్షుడు రామ్మూర్తి, పరశురాం, మొద్దు, భగీరథ, బూత్ ఇంచార్జి కృష్ణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.