అస్వస్థతతో కేజీబీవీ విద్యార్థిని మృతి

1974చూసినవారు
అస్వస్థతతో కేజీబీవీ విద్యార్థిని మృతి
డుంబ్రిగుడ మండలంలోని కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న బడ్నాయిని లక్ష్మీదేవి (15) అనే గిరి విద్యార్థిని అస్వస్థతతో మృతి చెందింది. అనారోగ్యానికి గురి కావడంతో ఈనెల 4న ఆమె తండ్రి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. శనివారం సాయంత్రం అజీర్తితో బాధపడటంతో కుటుంబ సభ్యులు నాటువైద్యం చేయించారు. ఆదివారం ఉదయం ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో డుంబ్రిగుడ ఆరోగ్య కేంద్రానికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్