1 కిలోమీటర్ దూరం నుంచి మంచినీరు మోసుకొస్తున్న గిరిజన మహిళలు

2034చూసినవారు
1 కిలోమీటర్ దూరం నుంచి మంచినీరు మోసుకొస్తున్న గిరిజన మహిళలు
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీలోని అనంతగిరి మండలం టోకూరు పంచాయితీ, సీసాగూడ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. వర్షం కారణంగా సోలార్ పనిచేయకపోవడంతో, గిరిజన మహిళలు రెండు రోజులుగా 1 కిలోమీటరు దూరంలోని బగుమారవలస నుంచి నీటిని మోసుకువస్తున్నారు. జలజీవన్ మిషన్ కింద మంజూరైనప్పటికీ, టోకూరు వద్ద బోరు వేసి సంవత్సరం గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి తమ తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్