బెల్ట్‌ షాపులపై భీమిలి పోలీసుల మెరుపు దాడులు

0చూసినవారు
బెల్ట్‌ షాపులపై భీమిలి పోలీసుల మెరుపు దాడులు
భీమిలి పరిధిలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సీపీ శంఖబ్రత బగ్చి ఐపీఎస్‌ ఆదేశాల మేరకు, డీసీపీ పర్యవేక్షణలో సీఐ జి. దివాకర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో చిన్న ఉప్పాడ, నిడిగట్టు, ఎగువపేట, సిటీనగర్‌, చిప్పాడ గ్రామాల్లో దాడులు చేపట్టారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి మొత్తం 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలపై ఐదు కేసులు నమోదు చేశారు. అక్రమ మద్యం విక్రయాలపై దాడులు కొనసాగుతాయని సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్