భీమిలి నియోజకవర్గంలో ఈ నెల 30న పీఎం పాలెంలోని సాంకేతిక ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ మేళాలో సుమారు 115 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, ఇప్పటివరకు 3 వేల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారని తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, రవాణా, తాగునీరు, వైద్య సదుపాయాలు, పార్కింగ్, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి జాబ్ మేళాను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.