డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. భవిష్యత్తును కాపాడుకోవాలి

2చూసినవారు
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. భవిష్యత్తును కాపాడుకోవాలి
రైట్ ఆఫ్ స్టూడెంట్స్ యూత్ ఫోరం ఆధ్వర్యంలో పెద్దిపాలెం భవిష్య జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు జరిగింది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏసీపీ సీహెచ్‌వీ మహేష్‌కుమార్ మాట్లాడుతూ, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను, ఆరోగ్యం, చదువు, కుటుంబ జీవితం, భవిష్యత్తుపై వాటి దుష్ప్రభావాలను వివరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సరఫరాపై ఈగల్ బృందాలు నిఘా ఉంచడంతో పాటు యువతలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజేశ్వరి, ఎస్సై అరుణ్‌కుమారి, కళాశాల ప్రతినిధులు, ఫోరం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్