గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటిన యువతి

409చూసినవారు
గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటిన యువతి
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడి గ్రామానికి చెందిన గట్రెడ్డి సంతోషి గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. మంగళవారం విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సాధారణ పరిపాలన శాఖలో ఏఎస్ఓగా ఎంపిక కాగా, శుక్రవారం రాత్రి విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (RTO)గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె మాకవరపాలెం రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్