విశాఖలో జరిగే భారత్-ఆస్ట్రేలియా మహిళల ప్రపంచకప్ మ్యాచ్ సందర్భంగా, దిగ్గజ మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్, రావి కల్పనకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అరుదైన గౌరవం దక్కించనుంది. అక్టోబర్ 12న విశాఖలోని వీడీసీఏ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ సందర్భంగా, స్టేడియంలోని ఒక స్టాండ్‌కు మిథాలీ రాజ్ పేరు, ఒక గేటుకు రావి కల్పన పేరు పెట్టనున్నట్లు ఏసీఏ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.