విశాఖపట్నంలోని భీమిలి బీచ్‌లో తప్పిపోయిన 8 ఏళ్ల బాలుడిని సీఐ దివాకర్ సురక్షితంగా తల్లిదండ్రులకు బుధవారం అప్పగించారు. వివిధ మాధ్యమాల ద్వారా దర్యాప్తు చేసి, విశాఖ సీబీఎం కాంపౌండ్ ప్రాంతానికి చెందిన బాలుడిగా గుర్తించారు. కానిస్టేబుల్ సహాయంతో బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. బాలుడి తల్లిదండ్రులు సీఐ దివాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.