ఇంట్లో నాగుపాము హల్చల్

880చూసినవారు
విశాఖపట్నంలోని అగనంపూడి పరిధిలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో నాగుపాము కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్స్ క్యాచర్, సొసైటీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన చాకచక్యంగా నాగుపామును పట్టుకుని, దానిని అడవిలో వదిలేస్తామని తెలిపారు. పాములు కనిపిస్తే వాటిని చంపకుండా సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్