విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా జూలోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ జిరాఫీల సంరక్షణకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని తెలిపారు. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, జూ పార్క్‌లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్‌ను కూడా ఆయన ప్రారంభించారు.