విశాఖ‌లో డబుల్‌ డెక్కర్ బ‌స్సుల‌తో ఆదాయ‌మే ఆదాయం

378చూసినవారు
విశాఖ‌లో డబుల్‌ డెక్కర్ బ‌స్సుల‌తో ఆదాయ‌మే ఆదాయం
విశాఖ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ప్రభుత్వం గత నెలలో అందుబాటులోకి తెచ్చిన డబుల్‌ డెక్కర్‌ బస్సులకు విశేష స్పందన లభిస్తోంది. పర్యాటకుల డిమాండ్‌కు అనుగుణంగా రెండు బస్సులు నడుపుతున్నారు. ఉదయం ఆర్కే బీచ్‌ నుంచి బయలుదేరే ఈ బస్సులకు మొత్తం 11 స్టాపుల్లో ఆగుతూ పర్యాటకులు సందర్శనీయ ప్రాంతాలను చూసే సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రారంభించిన మొదట్లో రోజుకు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు ఆదాయం రాగా, ఇటీవల ఒక్కో బస్సు ద్వారా రోజుకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు ఆదాయం వస్తోందని జిల్లా పర్యాటకశాఖ అధికారిణి జె. మాధవి సోమవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్