ప్రముఖుల చిత్రాలను వాట్సాప్ డీపీగా పెట్టుకుని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫొటోను డీపీగా పెట్టుకుని విశాఖలో ఓ వ్యక్తిని రూ.80 వేలు మోసం చేసిన ఘటన కలకలం రేపింది. పార్కు మంజూరు చేయిస్తానని నమ్మించి, ఆఫీసు ఖర్చుల పేరుతో డబ్బులు డిమాండ్ చేసి సైబర్ కేటుగాడు ఈ మోసానికి పాల్పడ్డాడు. బాధితుడు విడతల వారీగా ఫోన్పే ద్వారా డబ్బులు బదిలీ చేశాడు.