వేపగుంట యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో అగ్నిప్రమాదం

575చూసినవారు
వేపగుంట యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో అగ్నిప్రమాదం
వేపగుంట రామాలయం వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో శనివారం తెల్లవారుజామున  అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 3 గంటల సమయంలో దట్టమైన పొగను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్