రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటన కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం చేరుకున్నారు. ఐఎన్‌ఎస్ డేగా విమానాశ్రయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు నారా
లోకేశ్, అనిత, ఎంపీ భరత్, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి కాసేపట్లో నోవాటెల్‌లో జరగనున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొంటారు.