ఈ నెల 29న ప్రపంచ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా, ప్రజల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచే లక్ష్యంతో శనివారం ఉదయం విశాఖ బీచ్ రోడ్డులో భారీ ర్యాలీ జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో "వాక్ ఫర్ ఎవ్రీ హార్ట్" పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని వివిధ మెడికల్ కళాశాలలు, నర్సింగ్ విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు గుండె ఆరోగ్యానికి సంబంధించిన నినాదాలు చేశారు.