విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో వ్యక్తి ఆత్మహత్య

335చూసినవారు
విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో వ్యక్తి ఆత్మహత్య
విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో బుధవారం ఉదయం ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు కంపెనీలో చీఫ్ ఇంజినీర్గా పనిచేస్తున్న హర్షవర్ధన్ (36) కుటుంబ కలహాల కారణంగా జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. ఆయన అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దువ్వాడ రైల్వేస్టేషన్లో ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

సంబంధిత పోస్ట్