విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు పాకిస్థాన్ గూఢచర్యం కుట్ర కేసులో కీలక నిందితుడు ఆల్తాఫ్‌హుస్సేన్ ఘాంచీభాయ్ అలియాస్ షకీల్‌కు ఐదున్నరేళ్ల సాధారణ కారాగార శిక్ష విధించింది. మొబైల్ సిమ్ కార్డులు, ఓటీపీలు, సోషల్ మీడియాను దుర్వినియోగం చేసినట్లుగా అతడు దోషిగా తేలాడు. యూఏ(పీ) చట్టం కింద ఐదున్నరేళ్లు, ఐటీ చట్టం కింద 2.5 సంవత్సరాల శిక్షలు విధించగా, ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని కోర్టు స్పష్టం చేసింది.