శెట్టిబలిజి వీధిలో అనుమానాస్పదంగా యువకుడు మృతి

3చూసినవారు
శెట్టిబలిజి వీధిలో అనుమానాస్పదంగా యువకుడు మృతి
మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శెట్టిబలిజి వీధిలో కర్రీ గణేశ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సీఐ గొలగాని అప్పారావు తెలిపారు. శనివారం రాత్రి ఇంట్లో నిద్రపోయిన గణేశ్, ఆదివారం ఉదయం లేవకపోవడంతో కుటుంబ సభ్యులు అతన్ని కేజీహెచ్‌కు తరలించారు. వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించడంతో, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్