విశాఖ ఉక్కు పరిరక్షణే ధ్యేయం

334చూసినవారు
విశాఖ ఉక్కు పరిరక్షణే ధ్యేయం
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఐద్వా జిల్లా కమిటీ తీర్మానం చేసింది. విశాఖలోని తమ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్. ఎన్. మాధవి, వై. సత్యవతి మాట్లాడుతూ, 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. దీనిని ప్రతిఘటించాలని వారు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్