మధురవాడలోని నాయుడు జువెలర్స్‌లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు భారీ చోరీకి పాల్పడ్డారు. దుకాణం వెనుక గోడకు కన్నం పెట్టి, సుమారు 20 కేజీల వెండి, కొంత బంగారం దోచుకెళ్లారు. బుధవారం ఉదయం యజమాని షాపు తెరవగానే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పీఎం పాలెం క్రైమ్ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.