ఐటీఐ జంక్షన్ వద్ద విషాదం..లిఫ్ట్ ప్రమాదంలో మహిళ మృతి

1855చూసినవారు
ఐటీఐ జంక్షన్ వద్ద విషాదం..లిఫ్ట్ ప్రమాదంలో మహిళ మృతి
కంచరపాలెం ఐటీఐ జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారి పక్కన ఉన్న భవనం 3వ అంతస్తులో పనిచేస్తున్న కిర్లంపూడికి చెందిన దుర్గాడ సీత అనే మహిళ లిఫ్ట్ లో పడి మరణించింది. భవనంలోని హాస్టల్ నిర్వహణలో ఆమె పనిచేస్తున్నారు. లిఫ్ట్ డోర్ తెరుచుకోవడంతో ప్రమాదవశాత్తు కిందపడి మరణించినట్లు ఎస్ఐ భాస్కరరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్