విశాఖపట్నంలో మే నెలలో జరిగిన 48 దొంగతనాల కేసుల్లో 59 మందిని అరెస్ట్ చేసి, 1.06 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబత్రబాగ్చి శనివారం తెలిపారు. క్రైమ్ రికవరీ నిర్వహించి బాధితులకు అప్పగించారు. బంగారం, వెండి, బైక్లు, వ్యాను, ఫోన్లు వంటివి రికవరీ చేసినట్లు తెలిపారు. నగరంలో క్రైమ్ రేట్ తగ్గించడానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.