జీవీఎంసీ 13వ వార్డు శ్రీ కృష్ణాపురంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. హనుమంతవాక నుంచి సింహాచలం వైపు గుబ్బల మహేశ్ (37) అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా చెట్టు కొమ్మ తగలడంతో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఘటనా స్థలంలో మహేష్ మృతి చెందినట్లు వెల్లడించారు. వెనుకాల కూర్చున్న వ్యక్తికి స్వల్ప గాయలైయ్యాయన్నారు.