విశాఖపట్నం, ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు తమ నిరసనను విరమించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రతినిధిగా కోపరేటివ్ సొసైటీ అధికారిణి త్రివేణి విశ్వవిద్యాలయానికి వచ్చి, కేజీహెచ్ సూపరింటెండెంట్, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు మరో వైద్య నిపుణుడితో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దసరా సెలవులు పూర్తయ్యేలోగా డిస్పెన్సరీకి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అంగీకరించారు. విద్యార్థులు లేవనెత్తిన 10 డిమాండ్లను పరిశీలించి, దసరా సెలవులు ముగిసేలోపు పరిష్కరిస్తామని వీసీ హామీ ఇచ్చారు.