విశాఖ: సిలిండర్ కోసం డెలివరీ బాయ్‌పై దాడి..!

646చూసినవారు
విశాఖ: సిలిండర్ కోసం డెలివరీ బాయ్‌పై దాడి..!
విశాఖపట్నంలోని లంకెలపాలెంలో బుధవారం ఒక గ్యాస్ డెలివరీ బాయ్‌పై ఇద్దరు వ్యక్తులు ఇనుపరాడ్‌తో దాడి చేశారు. భీమనపల్లి రమణబాబు (50) అనే డెలివరీ బాయ్‌ను, ముందుగా బుకింగ్ చేస్తేనే సిలిండర్ ఇస్తానని చెప్పినందుకు, మద్యం మత్తులో ఉన్న దుండగులు ఆటో నుంచి దింపి కొట్టారు. ఈ దాడిలో రమణబాబు తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరవాడ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్