ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్టూడెంట్స్ యునైటెడ్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'జయహో కలాం - ఆఫ్ కోర్స్ సలాం కలాం' జయంతి ఉత్సవాల ప్రోమోను విశాఖపట్నంలోని హెలిప్యాడ్ వద్ద ఆవిష్కరించారు. శుక్రవారం విశాఖ వచ్చిన ముఖ్యమంత్రిని స్టూడెంట్స్ యునైటెడ్ నెట్‌వర్క్ ప్రతినిధులు కలిసి, తాము నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు.