విఎంఆర్డిఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్, గత పాలకుల హయంలో మాస్టర్ ప్లాన్ లో జరిగిన తప్పిదాలపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. సోమవారం జరిగిన మాస్టర్ ప్లాన్ -2041 పై సమీక్షలో, చైర్మన్ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ కె ఎస్ విశ్వనాధన్ మాస్టర్ ప్లాన్ పై సమీక్షించి, పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కె రమేశ్, కార్యదర్శి మురళీ కృష్ణ, ముఖ్య ప్రణాళిక అధికారి శిల్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు.