విశాఖ ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కె. లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, ప్రతి ఉద్యోగి పదవీ విరమణ పొందడం సహజమని, అది వృత్తిలో భాగమని అన్నారు. పోలీసుశాఖకు సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన టూటౌన్ ఎస్ఐ దాసరి రాము, ఆయన సతీమణి జమున లను ఏసీపీ ఘనంగా సన్మానించారు. విశాఖ టూటౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఓ హోటల్ లోని పదవీ విరమణ ఆత్మీయ వీడ్కోలు ఘనంగా నిర్వహించారు.