విశాఖ: విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

392చూసినవారు
విశాఖ: విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, విద్యార్థులను సక్రమ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, అందుకు వారు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలని అన్నారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలోని అంబేడ్కర్ అసెంబ్లీ హాలులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.