లైంగిక వేధింపుల నిరోధిక కమిటీ వేయండి.

2416చూసినవారు
లైంగిక వేధింపుల నిరోధిక కమిటీ వేయండి.
గాజువాకలో జివియంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మహిళా అధ్యక్షురాలు బత్తిన మీనాక్షి, ధనలక్ష్మి డాక్టర్ కిరణ్ కుమార్ (ఏఎంఓహెచ్)కు వినతి పత్రం సమర్పించారు. 64వ వార్డు గంగవరం పారిశుద్ధ్య కార్మికులు ఒక సూపర్వైజర్ తమను మహిళల పట్ల కనీస గౌరవం లేకుండా వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సూపర్వైజర్లను తగ్గించి, కార్మికులను ప్రమోట్ చేయాలని, డైలీ వేజ్ కార్మికులు సూపర్వైజర్లుగా వ్యవహరించడం వెంటనే నిలిపివేయాలని, రిటైర్మెంట్, డెత్ పోస్టులను వెంటనే భర్తీ చేసి పని భారం తగ్గించాలని కోరారు. లైంగిక వేధింపుల నిరోధక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్