విశాఖపట్నంలోని మారుతి సర్కిల్ నుంచి ములగాడ వెళ్లే రహదారిలో పోర్టు లాజిస్టిక్స్ లిమిటెడ్ ఎదురుగా ఉన్న మురికి కాలువలో ఒక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహం బాగా ఉబ్బిపోయి, కొంత భాగం కుళ్లిపోవడంతో మృతుడి వివరాలను గుర్తించడం కష్టంగా ఉందని వారు పేర్కొన్నారు.